సీపీఐది త్యాగాల చరిత్ర
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:31 AM
భారతదేశ గడ్డపై మహోజ్వల పోరాటాల, త్యాగాల చరిత్ర కలిగినది సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌లోని గీతా భవన్ చౌరస్తా నుంచి రెడ్ షర్ట్ వలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు.
గణేశ్‌నగర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారతదేశ గడ్డపై మహోజ్వల పోరాటాల, త్యాగాల చరిత్ర కలిగినది సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌లోని గీతా భవన్ చౌరస్తా నుంచి రెడ్ షర్ట్ వలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ పార్టీ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఎగురవేశారు. పలువురు నాయకులను సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. దోపిడీకి పాల్పడుతున్న వర్గాలకు వ్యతిరేకంగా మార్ ్క్స సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. వేలాదిమంది అమరుల త్యాగాలతో ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు. ఈ వంద సంవత్సరాల ఉద్యమాలను, పోరాటాలను, విజయాలను ప్రజలకు వివరిస్తూ మరింత పట్టుదలతో సీపీఐ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:31 AM