ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాదాబైనామాలపై ఆశలు

ABN, Publish Date - Dec 21 , 2024 | 01:30 AM

సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల ఆశలు నెరవేరనున్నాయి. సాదాబైనామాల భూములకు సంబంధించి రికార్డుల లేకపోవడం, పట్టా దారులుగా గుర్తించలేని పరిస్థితులు నెలకొనడం వంటి కారణాలతో ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమవుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిన తెలంగాణ భూ భారతి బిల్లు - 2024తో వారి నిరీక్షణకు తెరపడనుంది.

- భూ భారతితో మోక్షం

- పదేళ్ల నిరీక్షణకు ఉపశమనం

- జిల్లా వ్యాప్తంగా 15 వేల దరఖాస్తులు

- అమల్లోకి రానున్న ఆర్వోఆర్‌-24 చట్టం

- అసెంబ్లీలో తెలంగాణ భూభారతి బిల్లు-2024

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల ఆశలు నెరవేరనున్నాయి. సాదాబైనామాల భూములకు సంబంధించి రికార్డుల లేకపోవడం, పట్టా దారులుగా గుర్తించలేని పరిస్థితులు నెలకొనడం వంటి కారణాలతో ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమవుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిన తెలంగాణ భూ భారతి బిల్లు - 2024తో వారి నిరీక్షణకు తెరపడనుంది. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశ పెట్టిన ఆర్వోర్‌ చట్టం - 2024 బిల్లుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 వేల మంది సాదాబైనామాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగనున్నాయి.

సాదాబైనామాలకు పాస్‌ పుస్తకాలు

సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించి క్రమబద్ధీకరి స్తామని గత ప్రభుత్వం ప్రకటించినా అచరణలోకి రాలేదు. 2 జూన్‌ 2014లోగా సాదాబైనామాల ద్వారా భూ క్రయవిక్రయాలు జరిపిన రైతులకు పట్టాదారు పుస్తకాలు జారీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించినా ముందుకు సాగని పరిస్థితి. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ ద్వారా సాదాబైనామాల రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ చేపట్టి అర్హత ఉన్న దరఖాస్తులను పరిశీలించనున్నారు. మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వం 2020 సంవత్సరం నవంబరు వరకు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో 15 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మీ సేవ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో సిరిసిల్ల మండలంలో 428, వేమువాడ మండలం 675, వేములవాడ రూరల్‌ 1072, ఎల్లారెడ్డిపేట 1227, తంగళ్లపల్లి 1776, ముస్తాబాద్‌ 1685, గంభీరావుపేట 1403, చందుర్తి 1259, బోయినపల్లి 764, కోనరావుపేట 2690, రుద్రంగి 162, వీర్నపల్లిలో 379 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని క్రమబద్ధీకరించే చర్యలు మాత్రం జరగలేదు. గత ప్రభుత్వం 2020 అక్టోబరు 24న ధరణి పోర్టల్‌ తీసుకురాగా నవంబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ అనేక ఇబ్బందుల మధ్య ధరణి కొనసాగింది. ఇందులో సాదాబైనామాలకు మోక్షం లభించలేదు.

సంక్షేమ పథకాలు దూరం

సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించి పట్టాదారు పుస్తకాలను జారీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో గత ప్రభుత్వం పెండింగ్‌లోనే పెట్టింది. కోర్టులో దాఖలైన పిటిషన్లకు గత ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతోనే పరిష్కారం లభించలేదు. దీంతో రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమయ్యారు. రైతు బంధు, రైతు బీమా, బ్యాంకురుణాలు, రుణమాఫీ వంటి పథకాలను అందుకోలేకపోయారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్వోఆర్‌-2024 చట్టం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఉపయోగపడు తుందని భావిస్తున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ చట్టాన్ని పారదర్శకతగా అమలు చేయనున్నారు. కొత్త చట్టం ద్వారా కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా తహసీల్దార్లు, ఆర్డీవోలకే అధికారాలు కేటాయించనున్నారు. మ్యూటేషన్‌, చట్టబద్ధ హక్కుల నమోదు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, భూ రికార్డుల సవరణ, సాదాబైనామా, ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌ దరఖాస్తులకు సంబంధించిన అంశాలు ఆర్డీవో పరిధిలో, విరాసత్‌తోపాటు మరికొన్ని అంశాలు తహసీల్లార్లకు అప్పగించనున్నారు. దీంతో సాదాబైనామా దరఖాస్తులు వేగంగా పరిష్కారం అవుతాయని రైతులు భావిస్తున్నారు.

Updated Date - Dec 21 , 2024 | 01:30 AM