ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేటీఆర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:51 AM

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచిం ది మాజీ మంత్రి కేటీఆర్‌ అని, రాజకీయ కక్షలతో కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు.

గోదావరిఖని, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచిం ది మాజీ మంత్రి కేటీఆర్‌ అని, రాజకీయ కక్షలతో కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. శుక్రవారం గోదావ రిఖని ప్రధాన చౌరస్తాలోని టీబీజీకేఎస్‌ కార్యాలయ ఆవరణలో కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివే యాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 420 హామీ లు నేరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ కోరుకంటి చంద ర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చందర్‌ మాట్లాడుతూ రేవంత్‌ సర్కార్‌ ఏదో ఒక విధం గా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, మాజీ మంత్రి కేటీఆర్‌ను బదనాం చేయాలన్న లక్ష్యంతో అక్రమ కేసులతో కక్ష సాధింపులకు దిగుతుందన్నా రు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా బెదిరేది లేదన్నారు. రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదని పోలీసు పాలన అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదిస్తే ఆరెస్టులు చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చ కుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఉద్యమాల గడ్డ రామగుండం నుంచి రెవంత్‌రెడ్డి పాలన పతనం ప్రారంభమైందన్నారు. కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసుల ను ఎత్తివేసే దాకా రిలే దీక్షలు సాగుతాయని హెచ్చరించారు. రాబోవు కాలంలో ప్రజా కోర్టులో రేవంత్‌ సర్కారుకి తగిన శాస్తి జరగడం ఖాయ మన్నారు. ఈ దీక్షల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు మూల విజయరెడ్డి, గోపు ఐలయ్య యాదవ్‌, కార్పొరేటర్లు గాదం విజయ, బాదె అంజలి, జనగామ కవిత సరోజిని, నాయకులు నారాయణదాసు మారుతి, అచ్చే వేణు, బొడ్డు రవీందర్‌, మేతుకు దేవరాజ్‌, రాకం వేణు, జిట్టవేన ప్రశాంత్‌, సట్టు శ్రీనివాస్‌, తోకల రమేష్‌, నూతి తిరుపతి, సింహచలం రత్నకర్‌, చెలకలపల్లి శ్రీనివాస్‌, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్‌, కృష్ణస్వామి, ఇరుగురాళ్ల శ్రావన్‌, చింటూ, రామరాజు, ఆవునూరి వెంకటేష్‌, ముద్దసా ని సంధ్యారెడ్డి, కోడి రామకృష్ణ, యాసర్ల తిమోతి, కర్రి ఓదేలు, గడ్డం నారాయణ, నిట్టూరి రాజు, బోయ రాజ్‌శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:51 AM