Congress: సంజయ్ కాంగ్రెస్‌లో చేరికతో కీలక పరిణామం..!!
ABN, Publish Date - Jun 24 , 2024 | 10:36 AM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు. తనకు తెలియకుండానే సంజయ్ కుమార్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు. తనకు తెలియకుండానే సంజయ్ కుమార్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) ఆగ్రహంతో ఉన్నారు.
వ్యతిరేకిస్తోన్న జీవన్ వర్గం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే జీవన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. పార్టీలో సంజయ్ కుమార్ చేరిక అంశం గురించి చర్చించారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీనియర్ అయిన తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని జీవన్ రెడ్డి అంటున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది.
సీనియర్ నేత
తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయారు. లేదంటే మంత్రివర్గంలో తప్పకుండా చోటు లభించేది. ఓ సమయంలో సీఎం రేసులో జీవన్ రెడ్డి పేరు వినిపించింది. వయస్సు దృష్ట్యా ఆనను పరిగణలోకి తీసుకోలేదనే వార్తలు వినిపించాయి. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి మంచి పేరు ఉంది. వైఎస్ హయాంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేశారు.
ఇది కూడా చదవండి:
Bhadradri: కంచుమేళం కళాకారుడు, ‘పద్మశ్రీ’ సకిని రామచంద్రయ్య కన్నుమూత
Hyderabad: ఔను.. ఖర్చు రెట్టింపైంది!
Updated Date - Jun 24 , 2024 | 10:36 AM