Vemulavada: రాజన్న క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు
ABN, Publish Date - Mar 27 , 2024 | 09:50 AM
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ (Vemulavada) రాజన్న క్షేత్రం (Rajanna Kshetram)లో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు (Shiva Kalyana Mahotsavams) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపార్వతులు, జోగినిలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. 30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో ఐదు రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కాగా బుధవారం సాయంత్రం 3 గంటల వరకు కోళ్ల మొక్కుల చెల్లింపులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది.
Updated Date - Mar 27 , 2024 | 09:55 AM