ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 29 , 2024 | 12:47 AM
ఉద్యోగులు ఎదు ర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని టీఎన్జీవో సంఘం జిల్లా అధ్య క్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ కోరారు.
జ్యోతినగర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు ఎదు ర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని టీఎన్జీవో సంఘం జిల్లా అధ్య క్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ కోరారు. టీఎన్‌జీ వోల రామగుండం యూనిట్ ఆధ్వ ర్యంలో శనివారం ఎన్‌టీపీసీ ఎఫ్‌ఐ సీ క్రాస్‌లో జరిగిన తెలంగాణ ఎన్జీవోల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరై బొంకూరి శంకర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని తదితర ఉద్యోగుల కు సంబంధించిన అన్ని అంశాలను త్వరగా పరిష్క రించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావా లని సూచించారు. అనంతరం భారీ సంఖ్యలో ఉద్యో గులు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సందీప్‌రావు, ఉపాధ్యక్షులు కొమురయ్య, పట్టణ కార్యదర్శి ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ కెపి సరిత, శివ, రామగుండం యూనిట్ సభ్యులు జగన్, అంజి, అలీ, రత్నం, శ్రీవాణి, స్వాతి, మధురిక, రిట కుమారి, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 12:47 AM