అభివృద్ధి వైపు అడుగులు
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:02 AM
పదకొండున్నర శాతం వడ్డీ తో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ, అభివృద్ధి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పదకొండున్నర శాతం వడ్డీ తో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ, అభివృద్ధి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని మేడారం గ్రామంలోని గొల్లవాడ నుంచి గోపాల్‌రావుపేట గ్రామం వరకు సీఎస్ ఆర్ నిధుల ద్వారా 45 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో 150 మంది లబ్దిదారులకు 44,38,500 రూపాయలు విలువ గల చెక్కులను అందజేశారు. అనంతరం అడ్లూరి మాట్లాడు తూ పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి మేడారం వచ్చినప్పుడు గ్రామానికి సోలార్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందరమ్మ ఇండ్ల విషయంలో కూడా పేద వారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేందుకు సర్వే జరుగుతోందని, గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ ప్రాంతాన్ని టూరీజం కారీడార్‌గా అభి వృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరగా రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మ న్ లావుడ్య రూప్లానాయక్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏఎంసీ చైర్మెన్ వైస్ చైర్మన్ అరిగె లింగయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మెన్ కొత్త నర్సిహులు, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ కాడే సూర్యనారాయణ, మాజీ వీఎస్‌ఎస్ చైర్మన్ దేవి జనార్ధన్, పంచా యతీరాజ్ డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 01:02 AM