ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రొటోకాల్‌ రగడ..

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:25 AM

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్‌ రగడ మొదలయ్యింది. ‘అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని, శిలాఫలకాల్లో అధికారులు తన పేరు పెట్టడం లేదని, ఇలా ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో కనుక్కోవాలి’.. అంటూ ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించడం కలకలం రేపుతున్నది. ఈ వ్యాఖ్యలు అటు.. కాంగ్రెస్‌ పార్టీలో, ఇటు.. జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్‌ రగడ మొదలయ్యింది. ‘అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని, శిలాఫలకాల్లో అధికారులు తన పేరు పెట్టడం లేదని, ఇలా ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో కనుక్కోవాలి’.. అంటూ ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించడం కలకలం రేపుతున్నది. ఈ వ్యాఖ్యలు అటు.. కాంగ్రెస్‌ పార్టీలో, ఇటు.. జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 4న పెద్దపల్లిలో జరిగిన సీఎం హాజరైన యువ వికాసం బహిరంగ సభలో కూడా తన విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని వ్యాఖ్యానించారు. తాజాగా మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మరోసారి ప్రొటోకాల్‌ అంశంతో పాటు ప్రభుత్వ జీవో ఉన్నా కూడా ఈనెల 22న పెద్దపల్లి కలెక్టరేట్‌లో ‘కాకా’ వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహించకుండా కాకా, తమతో పాటు దళితులను అవమానించారని, కలెక్టర్‌ కుల పిచ్చితో పని చేస్తున్నారని ఎంపీ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. అంతేగాకుండా ధర్మపురి నియోజకవర్గంలో మంగళవారం జరిగే కార్యక్రమాలకు కూడా ఆహ్వానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే పెద్దపల్లి పార్లమెంట్‌లో పరిధిలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు.. పార్లమెంట్‌ పరిధిలో ఉన్న జిల్లాల అధికారులు కూడా తన విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదనే విషయాన్ని ఎంపీ చెప్పకనే చెప్పారు. ఇది ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు చేయిస్తున్నారో.. అనే వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలను ఉద్ధేశించి చేసినవా, మరెవరినైనా ఉద్ధేశించినవా అనే విషయమై చర్చ జరుగుతున్నది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి మనువడు వంశీకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 7 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇందులో ఎంపీ వంశీకృష్ణ తండ్రి వివేక్‌ వెంకటస్వామి చెన్నూరు నుంచి, పెద్దనాన్న గడ్డం వినోద్‌ కుమార్‌ బెల్లంపల్లి నుంచి గెలుపొందారు. మంథని నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ మంత్రి, ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్న వాడైనప్పటికీ, అందరితో మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలతో పాటు, పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీ హాజరవుతున్నారు. అన్ని కార్యక్రమాల్లో కాకపోయినా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎంపీ విషయంలో అధికారులు కావాలనే ప్రొటోకాల్‌ పాటించడం లేదా, ఇంకా ఎవరైనా వారిని ప్రొటోకాల్‌ పాటించకుండా నిలువరిస్తున్నారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

ఫ జిల్లాలో జోరుగా చర్చ..

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గానికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించి, ఒకసారి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేయడంతో నష్టాల్లో ఉన్న సింగరేణిని గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించిన గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ జీవో ఉన్నా కూడా ఈనెల 22న పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించ లేదని, కలెక్టర్‌ వివక్ష చూపుతున్నారని, సహించేది లేదని మండిపడ్డారు. తన విషయంలో ప్రొటోకాల్‌ పాటించకపోవడం, తన తాత కాకా వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడంతో ఆయన మరింత ఆవేదనకు లోనైనట్లు కనబడుతున్నది. అలాగే పెద్దపల్లిలో జరిగిన సీఎం సభలో ఎంపీ వంశీకృష్ణ ప్రొటోకాల్‌ విషయమై మాట్లాడేందుకు అది వేదిక కాకపోయినా ఆ సభలో మాట్లాడాన్ని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు నొచ్చుకున్నట్లు సమాచారం. అధికారుల తీరుపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌ చేస్తాననడంతో ఈ ప్రొటోకాల్‌ రగడ ఎటువైపు దారి తీస్తుంది.. అసలు ఏం జరగనున్నదోననే అంశం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతి నిర్వహించకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి సంస్థ అధికారి నాగలైశ్వర్‌ను ఫోన్‌లో వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.

Updated Date - Dec 25 , 2024 | 01:25 AM