ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రెంచ్‌ కటింగ్‌ పనులు సకాలంలో పూర్తి

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:43 AM

వరంగల్‌-మంచిర్యాల జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 163జీ నిర్మాణానికి సేకరించిన భూములలో ట్రెంచ్‌ కటింగ్‌ పనులు పూర్తి చేసి జాతీయ రహదారి ఆథారిటికి అప్పగిం చాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

మంథని, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌-మంచిర్యాల జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 163జీ నిర్మాణానికి సేకరించిన భూములలో ట్రెంచ్‌ కటింగ్‌ పనులు పూర్తి చేసి జాతీయ రహదారి ఆథారిటికి అప్పగిం చాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శని వారం మంథని మండలంలోని కన్నాల, పందులపల్లి గ్రామాల్లో ట్రెంచ్‌ కటింగ్‌ పను లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మంచిర్యాల-వ రంగల్‌-ఖమ్మం జిల్లాలను కలిపే 4 లైన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సేకరించిన భూమిని జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించామని, మంథని మండలం కన్నాల, పందులపల్లి గ్రామాల్లో ట్రెంచ్‌ కటింగ్‌ పనులను ప్రారం భించిందన్నారు. భూములల్లో ట్రెంచ్‌ పనుల ను సకాలంలో పూర్తిచేసి, జాతీయ రహదారి నిర్మాణపనులు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. జాతీయ రహదారి కింద సేకరించిన భూముల్లో యాసంగి పంటలు సాగు చేయరాదని రైతులకు సూచించారు. కలెక్టర్‌ వెంట మంథని తహసీల్దార్‌ రాజయ్య, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:43 AM