ఆర్జీ-2లో పర్యటించిన డైరెక్టర్
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:25 AM
సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం, ఆపరేష న్స్) సత్యనారాయణరావు గురువారం ఆర్జీ-2 ఏరి యాలో పర్యటించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం, ఆపరేష న్స్) సత్యనారాయణరావు గురువారం ఆర్జీ-2 ఏరి యాలో పర్యటించారు. ఓసీపీ-3 స్టోర్స్‌ని తనిఖీ చేసిన ఆయన స్టోర్స్ అధికారులతో సమావేశమ య్యారు. స్టోర్‌లో మెటీరియల్ భద్రపరిచే షెడ్‌ల ను పరిశీలించారు. మెటీరియల్ భద్రపరచడానికి అనువుగా షెడ్ల నిర్మాణం పూర్తిచేయాలని అధికా రులకు సూచించారు. అనంతరం సీహెచ్‌పీలో నిర్మాణంలో ఉన్న బంకర్ పనులను పరిశీలిం చారు. బొగ్గు రవాణాకు అనుగూణంగా బంకర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదే శించారు. ఓసీపీ-3 వ్యూపాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, యం త్రాల వినియోగంపై అధికారులను అడిగి వివ రాలు తెలుసుకున్నారు. డిమాండ్‌కు తగిన విధం గా బొగ్గు ఉత్పత్తి చేయాలని, వార్షిక లక్షాన్ని సాధించాలంటే రోజువారి టార్గెట్‌ను అధిగమిం చాలని సూచించారు. డైరెక్టర్ సత్యనారాయణ రావు వెంట ఎక్స్‌ప్లోజివ్ జీఎం బైద్య, ఏరియా ఇంజనీర్ నరసింహారావు, పీవో మధుసూదన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సంతోష్ కుమార్, పీఈ విజయ్‌కుమార్, సివిల్ డీజీఎం ధనుంజయ్, ఎస్‌ఎస్‌ఓ షరీఫ్ హహమ్మద్ ఉన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:25 AM