గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వాజ్‌పేయి కృషి
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:21 AM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎనలేని కృషి చేశారని బీజేపీ జిల్లా కోఆర్డినే టర్ కే రాజగోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అన్నారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎనలేని కృషి చేశారని బీజేపీ జిల్లా కోఆర్డినే టర్ కే రాజగోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అన్నారు. వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని, గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద ప్రతి గ్రామంలో రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా పేద పిల్లల చదువు కోసం కృషి చేశారన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శిలారపు పర్వతాలు, పెద్దపల్లి రవీందర్, మహవాది రామన్న, కాసిపేట శివాజీ, జక్కుల నరహరి, నవీన్, శ్రీని వాస్, మంజు, కుమారస్వామి పాల్గొన్నారు.
జ్యోతినగర్ (ఆంధ్రజ్యోతి) : భారత రత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాలలో భాగంగా గురువారం ఎన్టీపీసీలో బీజేపీ శ్రేణులు స్వచ్ఛ భారత్ నిర్వహించా రు. అన్నపూర్ణకాలనీలో దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెరుగు హన్మంతుగౌడ్ ఇతర నాయకులు పాల్గొని శ్రమదానం చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అజాత శత్రువుగా, నిజాయితీగల రాజ కీయ నాయకుడిగా నిలిచిన వాజ్‌పేయి అందరికి ఆదర్శమని నాయ కులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిట్టపల్లి సతీష్, గాండ్ల ధర్మపురి, కోమళ్ల మహెశ్, కుమారస్మాఇ, సంజీవ్, రమేష్, భూమ య్య, అంజి, తిరుపతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:21 AM