ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల అభివృద్ధికి సంక్షేమ పథకాలు

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:54 AM

పేదల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందజేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలపరిషత్‌ కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన 51 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

- మానకొండూర్‌ ఎమ్మెల్యే సత్యనారాయణ

ఇల్లంతకుంట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పేదల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందజేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలపరిషత్‌ కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన 51 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారం కావద్దనే కల్యాణలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అంతకుముందు ఇల్లంతకుంట స్పోర్ట్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.ప్రభుత్వం రాష్ట్రంలో ఆటల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సీఎం కప్‌ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి, నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, రమణారెడ్డి, పాశం రాజేందర్‌రెడ్డి, అంతగిరి వినయ్‌కుమార్‌, పసుల వెంకటి, అయిలయ్య, ఉప్పల అమేందర్‌, స్పోర్ట్స్‌క్లబ్‌ అధ్యక్షుడు మామిడి రాజు, బాలపోచయ్య, ప్రసాద్‌, ఒగ్గు రమేష్‌, చల్ల నారాయణ, తిరుపతి, పుష్పలత, నరేష్‌. ప్రదీప్‌రెడ్డి, ఉస్మాన్‌, బెజ్జంకి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:55 AM