ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణమాఫీ అయ్యేనా?

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:13 AM

కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల మేరకు రైతులకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టారు.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల మేరకు రైతులకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టారు. దానికి అనుగుణంగానే 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రుణాలు తీసుకున్న వారికి మాపీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 61,234 మంది రైతులు రూ. 702.36 కోట్ల రుణాలను పొందారు. ఇందులో అర్హులకు సంబంధించి రెండు లక్షల మేరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ పకడ్బందీగా చేపట్టింది. తాజాగా జిల్లాలో ఇంకా దాదాపు 20 నుంచి 30 శాతం వరకు రెండు లక్షలకు పైగా రుణాలు పొంది మాఫీ కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. తమకు రుణమాఫీ వర్తింపజేయాలని రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు దరఖాస్తులు చేసుకుంటూ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రెండు లక్షలకు పైగా రుణమాఫీకానీ వారిలో సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు. రెండు లక్షలకు పైగా ఉన్న అప్పును చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని రైతులు మిగతా డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. రుణమాఫీ కోసం చూస్తున్నా ఐదో జాబితా సిద్ధం చేస్తారా లేదా అనే దానిపై సందిగ్ధంతో ఉన్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్‌తో రైతులు రుణమాఫీ చేయడంవల్ల కూడా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- రూ 374.87 కోట్లు మాఫీ

జిల్లాలో రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. జిల్లాలో మూడు విడతల్లో 43,770 మంది రైతులకు రుణమాఫీ రూ 346.15 కోట్లు పూర్తి చేశారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలు, బ్యాంక్‌ ఖాతాల్లో తేడాలు వంటి అంశాలతో కొంత మంది రైతులకు రుణమాఫీ అందలేదు. ఈ క్రమంలోనే మళ్లీ నాలుగో విడతలో 3,357 మంది రైతులకు రూ 28.72 కోట్లు విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 47,127 మంది రైతులకు రూ 374.87 కోట్లు రుణమాఫీ జరిగింది. ఇందులో మొదటి విడతలో 23,785 మంది రైతులకు రూ 135.35 కోట్లు, రెండో విడతలో 12,202 మంది రైతులకు రూ 117.76 కోట్లు, మూడో విడతలో 7,783 మంది రైతులకు రూ 93.04 కోట్లు రుణమాఫీ చేశారు. రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపజేయాలని వస్తున్న డిమాండ్‌ మేరకు ప్రత్యేక ఫార్మట్‌ ద్వారా వివరాలను సేకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Dec 20 , 2024 | 01:14 AM