ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR Missing: ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ కలకలం రేపుతున్న పోస్టర్లు

ABN, Publish Date - Sep 04 , 2024 | 05:45 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘కనబడుట లేదు’.. అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ఫొటోని ముద్రించి ఈ పోస్టర్లను రూపొందించారు. ‘‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’’ అని పోస్టర్‌పై రాసుకొచ్చారు. కాగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘కనబడుట లేదు’.. అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ఫొటోని ముద్రించి ఈ పోస్టర్లను రూపొందించారు. ‘‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’’ అని పోస్టర్‌పై రాసుకొచ్చారు. కాగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదల అల్లకల్లోలాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఈ వరదల విలయంపై మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. ప్రభావిత ప్రాంతాల సందర్శనలకు వెళ్ల లేదు సరికదా.. కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. కానీ కేసీఆర్ వైఖరి చర్చనీయాంశమైంది.


కేసీఆర్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దాదాపు రెండు మూడు రోజులు కురిసిన భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలతో ఖమ్మం పట్టణం, పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్ ప్రాంతాలు విలవిల్లాడిపోయారు. ఆ ప్రాంత ప్రజలు హడలెత్తిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం ఒకరోజు రాత్రి ఖమ్మంలోనే ఉండి కలెక్టరేట్ కార్యాలయం నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఎన్నడూ చూడని వరదలు వచ్చాయని, బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందించాలని ఆయన కోరారు. అయితే ఇంత జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ నుంచి కనీస స్పందనలేకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ మేరకు మీమ్స్ కూడా పేలుతున్నాయి.


మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు క్షేత్ర స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ అధినేతగా ఉండి కనీసం స్పందించకపోవడం ఏంటనే ప్రశ్నలు కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు వెళ్లకపోవడం ఏమటని అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడంపై కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నాయి. అమెరికాలోజల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు ఆగ్రహం వ్యకం చేస్తు్న్నారు.


నిజానికి బీఆర్ఎ‌స్ నేతలు, మాజీ మంత్రులు వరద ప్రాంతాల్లో గట్టిగానే పర్యటించినప్పటికీ పార్టీకి అగ్రనేతలైన కేసీఆర్, కేటీఆర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎంగా పదేళ్లపాటు అవకాశం కల్పిస్తే జనం కష్టాలపై కనీసం స్పందించరా అంటూ కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

నేను బయటకొస్తే సహాయ చర్యలకు ఆటంకం: డిప్యూటీ సీఎం పవన్

బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి

Updated Date - Sep 04 , 2024 | 05:53 PM

Advertising
Advertising