KCR: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను..
ABN, Publish Date - Jan 31 , 2024 | 01:40 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రేపు ( గురువారం ) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రేపు ( గురువారం ) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు స్పీకర్ ఛాంబర్ లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు 12గంటలకే అసెంబ్లీకి చేరుకోనున్న కేసీఆర్ నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.ఎల్ఓపి నేతగా భాద్యతలు స్వీకరించనున్నారు. గతేడాది నవంబర్ లో ఎన్నికలు జరిగి, డిసెంబర్ లో ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేశారు. గజ్వేల్‌లో గెలిచిన కేసీఆర్ ఇప్పటికీ వరకు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు.
ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఫాంహౌస్ బాత్రూమ్‌లో కేసీఆర్ జారి పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తరువాత డిశ్చార్జ్ అయ్యారు. నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. ఆయన ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారనే దానిపై ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇచ్చారు.
త్వరలోనే కేసీఆర్ ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అందుకోసం మంచి ముహూర్తం చూసి తేదీ నిర్ణయిస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రమాణస్వీకారానికి రేపు మధ్యా్హ్నం ముహూర్తం ఖరారు చేశారు.
"మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."
Updated Date - Jan 31 , 2024 | 01:44 PM