ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMAX Stampede: ఖైరతాబాద్ ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట

ABN, Publish Date - Sep 15 , 2024 | 06:18 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ మరింత జోరుగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ మరింత జోరుగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిమజ్జన పాయింట్ల వద్దకు విగ్రహాలను భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నాయి. కాగా ఖైరతాబాద్‌లోని భారీ గణనాథుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఖైరతాబాద్ ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట వాతావరణం కనిపిస్తోంది.


క్యూలైన్లలో భక్తులు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. క్యూలైన్లలో వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇక బారికేడ్లు తొలగించడంతో భక్తులను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఈ అర్ధరాత్రి వరకే మహాగణపతి దర్శనానికి సమయం ఉండడంతో లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. పరిస్థితి శృతిమించడంతో భక్తులెవరు ఖైరతాబాద్‌కు రావద్దు అంటూ ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది.

Updated Date - Sep 15 , 2024 | 06:23 PM

Advertising
Advertising