ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teachers: ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్‌

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:01 AM

ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్‌ఎం)పై సస్పెన్షన్‌ వేటు పడింది.

  • ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకంలో నిర్లక్ష్యంపై చర్యలు

ఖమ్మం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిది): ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్‌ఎం)పై సస్పెన్షన్‌ వేటు పడింది. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుని 22 రోజులు పాటు విధులు నిర్వర్తించిన ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను గురువారం విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. తగిన విద్యార్హత లేదంటూ వారిని విధుల నుంచి తప్పించిన అధికారులు వారి స్థానాలను ఇతరులతో భర్తీ కూడా చేశారు. ధ్రువపత్రాల పరిశీలనలో జరిగిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో నెం. 25 ప్రకారం హిందీ పండిట్‌ పోస్టులు భర్తీచేయాలని నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం హెచ్‌పీటీ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌తో పాటు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా హిందీ తప్పనిసరిగా ఉండాలి.


కానీ, ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలు పొందిన వారిలో ఓ ఏడుగురు ‘దక్షిణ భారతహిందీ ప్రచారసభ మద్రాస్‌’ నుంచి హిందీ కోర్సులను పూర్తి చేసిన సర్టిఫికెట్లను సమర్పించారు. అయితే, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో సంబంధిత జీవోను పరిశీలించని హెచ్‌ఎంలు.. ఆ ఏడుగురు హిందీ పండిట్లను అర్హులుగా గుర్తించి ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో అర్హత ఉండి ఉద్యోగావకాశం కోల్పోయిన పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించాలని ఆదేశించారు. దీంతో ధ్రువపత్రాలను పునఃపరిశీలించిన అధికారులు జీవో నెం 25 ప్రకారం నియామకం జరగలేదని తేల్చారు. ధ్రువపత్రాల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పాఠశాల హెచ్‌ఎం పి.శివనారాయణ, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు పాఠశాల హెచ్‌ఎం సీహెచ్‌ రంగారెడ్డిని శుక్రవారం సస్పెండ్‌ చేశారు. కాగా, హెచ్‌ఎంల సస్పెన్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా హెచ్‌ఎంల సంఘం డీఈవోకు ఓ వినతి పత్రం అందజేసింది.

Updated Date - Nov 09 , 2024 | 05:01 AM