ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: వరదలతో ఖమ్మం జిల్లాకు భారీగా నష్టం

ABN, Publish Date - Sep 02 , 2024 | 08:24 PM

తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి.

ఖమ్మం: తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈరోజు(సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు.


జాగ్రత్తలు తీసుకున్నా.. నష్టపోయాం..

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ...3రోజులుగా భారీ వర్షాలు ఖమ్మం నగరాన్ని ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజలకు అండగా మంత్రులు, అధికారులు నిలిచారని అన్నారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని చెప్పారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని వివరించారు. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కొంత నష్టం తప్పదని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో వరద నష్టాన్ని ఇప్పటికే పరిశీలించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


ప్రధాని మోదీకి విజ్ఞప్తి....

ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కష్టకాలంలో అండగా ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం పనితీరుతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నియంత్రించగలిగామని అన్నారు. తెలంగాణను ఆదుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశామని అన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. వరదలతో ఏపీలోని కృష్ణా జిల్లా కంటే ఖమ్మం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


తెలంగాణకు రూ.5.430 కోట్ల నష్టం

గతంలో ఎన్నడూలేని విధంగా 40 సెం.మీ. వర్షపాతం నమోదైందని అన్నారు. వర్షాలతో తెలంగాణకు రూ.5.430 కోట్లమేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ స్వయంగా పర్యటించాలని కోరారు. విపత్తు సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ కేవలం ట్విట్టర్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. అమెరికా పర్యటన సమయంలో తమ ప్రభుత్వ మంత్రులపై కేటీఆర్ నిందలు వేశారని అన్నారు. ప్రజలకు అండగా ఉన్న మంత్రులపై బీఆర్ఎస్ నేతలు చిల్లర విమర్శలు చేయడం సరికాదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


వరదలపై రాజకీయాలు సరికాదు...

ఈ సమయంలో రాజకీయాలు సరికాదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో మౌనంగా ఉంటారని చెప్పారు. కేటీఆర్‌ అమెరికాలో ఉంటూ ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‎కు ప్రజలకంటే రాజకీయాలే ముఖ్యమని చెప్పారు. బాధితులను ఆదుకునే విషయంలో.. తమ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణకు కేంద్రం సాయం చేయాలి...

తెలంగాణకు కేంద్రం తక్షణ సాయంగా రూ.5,438 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. ఇళ్లలో సామాన్లు నష్టపోయిన బాధితులకు.. తక్షణ సాయంగా రూ.10వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్లకు తక్షణ సాయంగా రూ.5 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనతో విపత్తులపై పాలసీ లేకుండా పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated Date - Sep 02 , 2024 | 09:16 PM

Advertising
Advertising