Kothagudem: చర్ల మండలంలో వెలసిన మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:13 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు (Maoist) బ్యానర్లు (Banners), కరపత్రాలు (Pamphlets) వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలీసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాల ద్వారా పిలుపిచ్చారు. మణిపూర్ (Manipur)లో మహిళలపై జరిగిన అవమానీయ దాడులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారీ విధానాలను, పితృస్వామిక భావజాలాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపిచ్చారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల రాజ్యహింసలకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ మావోయిస్టులు కరపత్రాల ద్వారా విజ్ఞప్తి చేశారు.
Updated Date - Mar 04 , 2024 | 12:04 PM