ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ABN, Publish Date - Mar 04 , 2024 | 04:55 PM

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఖమ్మం జిల్లా: త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రజలు ఆశించిన మేరకు పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. పేదవాడికి తోడు నీడగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సింగరేణి ప్రభావిత ప్రజలను సింగరేణి అధికారులు ఆదుకోవాలని చెప్పారు.

రెవిన్యూ సెక్టార్‌లో అవినీతికి పాల్పడకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని అన్నారు. ఇప్పటికే సుమారు 22 వేల ఉద్యోగాల ఇచ్చామని చెప్పారు. మెగా డీఎస్సీని ప్రకటించామని.. 11 వేల ఉద్యోగ నియామకాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్‌కు ముందుగానే చేపడతామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పద్ధతులు మానుకోవాలని.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచిచేసేలా అధికారులు ముందుకు వెళ్లాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేలా మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

Mallu Ravi: నాగర్‌‌కర్నూల్ ఎంపీ టికెట్‌పై మల్లు రవి క్లారిటీ

TS Politics: బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి కారణమదే..?: పల్లా రాజేశ్వర్ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 05:31 PM

Advertising
Advertising