ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

N.V.Ramana: మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలి

ABN, Publish Date - Mar 10 , 2024 | 10:12 PM

మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(N.V.Ramana) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఖమ్మం: మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(N.V.Ramana) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎన్వీ రమణ దంపతులను సన్మానించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తనకు ఖమ్మంలో సన్మానం చేయడం సంతోషకరంగా ఉందని చెప్పారు. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ తర్వాత సన్మానం చేయడం సంతోషకరంగా ఉందన్నారు. తాను సీజేఐగా ఉన్నపుడు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపికయ్యారని తెలిపారు. ఖమ్మం అంటే ఉద్యమాల ఖిల్లా.. పోరాటాల జిల్లా అని చెప్పారు.

పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకంలో సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో ఖమ్మం ప్రస్తావన చదివానని గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, బొడేపూడి, నల్లమల్ల, చిర్రావూరి లాంటి నేతలున్న జిల్లా ఇదని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌తో ఖమ్మం జిల్లా సస్య శ్యామలంగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా ఖలీల్ ఖిబ్రా రాసిన కవితకు దాశరథీ అనువాదాన్ని ఎన్వీ రమణ చదివారు. కిన్నెరసాని గూర్చి విశ్వనాథ సత్యనారాయణ చక్కగా రాశారని వివరించారు. భద్రాచలం రామాలయంతో ఈ జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పారు. సమాజంలో ధనికులు, పేదల మధ్య దూరం లేకుండా చేయాలని సూచించారు. పొరుగు వారి గూర్చి ఆలోచన చేయాలన్నారు. ఏ దేశంలో ఉన్నా తల్లిదండ్రులను, మన గ్రామాన్ని మరవవద్దని సూచించారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా మీ గ్రామాల్లోనే మొదట మెచ్చుకుంటారని ఎన్వీరమణ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 10:13 PM

Advertising
Advertising