హైవేల నిర్మాణాలను వేగిరం చేయండి
ABN, Publish Date - Jun 26 , 2024 | 06:07 AM
తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న హైవేల నిర్మాణాలతో పాటు వివిధ రహదారుల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా చొరవ చూపాలని ‘జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’ చైర్మన్ సంతో్‌షకుమార్ యాదవ్‌ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ను కోరిన మంత్రి కోమటిరెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న హైవేల నిర్మాణాలతో పాటు వివిధ రహదారుల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా చొరవ చూపాలని ‘జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’ చైర్మన్ సంతో్‌షకుమార్ యాదవ్‌ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. హైదరాబాద్- మన్నెగూడ (ఎన్‌హెచ్-163) రోడ్డుకు ఉన్న ఎన్‌జీటీ సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొని, ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్- విజయవాడ రహదారి (ఎన్‌హెచ్-65)కి సంబంధించి ఉన్న వివాద పరిష్కారం కోసం ఎదురుచూడకుండా ఆరు వరసలుగా విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. మంగళవారమిక్కడి ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి చైర్మన్ సంతో్‌షకుమార్‌తో భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణం.. పలు జాతీయ రహదారుల మంజూరుపై మంత్రి వివరించారు. వాహనల రద్దీతో తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న హైదరాబాద్- కల్వకుర్తి (ఎన్‌హెచ్- 765) రోడ్డును నాలుగు వరసలుగా నిర్మించేందుకు కావాల్సిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
Updated Date - Jun 26 , 2024 | 07:44 AM