Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కి మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. బీఆర్ఎస్‌కి ఒక్క సీటు రాదు
ABN, Publish Date - Apr 24 , 2024 | 10:05 PM
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తెలివి ఉందని తాను అనుకున్నానని, కానీ ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఏం తెలియదని తేలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వస్తున్న తరుణంలో..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) తెలివి ఉందని తాను అనుకున్నానని, కానీ ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఏం తెలియదని తేలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) వస్తున్న తరుణంలో.. తనకేం పని లేక కేసీఆర్ ఏకంగా నాలుగు గంటల పాటు మీడియాతో మాట్లాడారని సెటైర్లు వేశారు. బిడ్డ (ఎమ్మెల్సీ కవితని ఉద్దేశిస్తూ) జైల్లో ఉంటే ఎవరికైనా మెంటల్‌గా బ్యాలెన్స్ తప్పుతుందని వ్యాఖ్యానించారు. మెంటల్‌గా తన పేరు ఇంకోసారి తీయొద్దని హెచ్చరించారు. తానేదో ఫ్రీడం ఫైటర్‌లాగా జైలు నుంచి బయటకు వచ్చినట్టు కవిత (MLC Kavitha) చెయ్యి ఊపుతుందని ఎద్దేవా చేశారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?
తాను నిజమైతే దీక్ష చేశానని, కేసీఆర్‌లాగా దొంగ దీక్ష చేయలేదని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష చేసినప్పటి వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. కేసీఆర్ హాయాంలో లాగ్ బుక్స్ ఎందుకు ప్రగతి భవన్‌కి తెప్పించుకున్నారని ప్రశ్నించారు. తాము ఫ్లోరైడ్‌ని తరిమికొట్టామని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని.. కానీ కేసీఆర్ వచ్చాకే నంద్యాలలో ఫ్లోరైడ్ పెరిగిందని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. బహుశా మెదక్‌లో కేసీఆర్‌కి డిపాజిట్ రావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. తన బహిరంగ సభకు జనాలు రాకపోవడం వల్ల కేసీఆర్ రోడ్లపై గంటలకు గంటలు వేచి చూశారని.. కేవలం రెండు వేల మందితోనే ఆయన తన సభని నిర్వహించారని అన్నారు. దీన్ని బట్టి.. తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని తేలిపోయిందని ధ్వజమెత్తారు.
త్వరలోనే జగన్‌కి ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్.. పెమ్మసాని షాకింగ్ కామెంట్స్
కేసీఆర్ కుటుంబం తెలంగాణ పరువు తీసిందని.. ఆయన బిడ్డ కవిత వల్ల రాష్ట్రం తలదించుకుందని వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో.. ఏదైనా ఆమెని ఇంట్లోనే పెట్టుకోండంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ తన బిడ్డలనైనా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలని సూచించారు. పొలంబాట నాటకాలు కేసీఆర్ ఆపేయాలని సూచించారు. ఏపీలో జగన్ మరోసారి అధికారంలోకి వస్తే, తనకు కొన్ని డబ్బులు ఇస్తాడని కేసీఆర్ అనుకుంటున్నాడని విరుచుకుపడ్డారు. ఇక తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తుందని మాటిచ్చారు.
Read Latest Telangana News and Telugu News
Updated Date - Apr 24 , 2024 | 10:05 PM