ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సురేఖ

ABN, Publish Date - Dec 02 , 2024 | 03:59 AM

భవిష్యత్తు తరాల మనుగడకు ఇబ్బంది లేకుండా భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు తరాల మనుగడకు ఇబ్బంది లేకుండా భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినం(డిసెంబరు 2) సందర్భంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేస్తూ మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది ‘స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి-సుస్థిరమైన జీవనం వైపు అడుగు’ అనే నేపథ్యంతో ప్రజలకు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పిచేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటుతూ, పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

Updated Date - Dec 02 , 2024 | 03:59 AM