ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: బుచ్చమ్మది.. రేవంత్‌ చేసిన హత్య

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:40 AM

‘హైడ్రా ఎక్కడ తన ఇల్లు కూల్చివేస్తుందో అని మూడు రోజులపాటు ఆందోళన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికీ హైడ్రా అనే అరాచక సంస్థ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన హత్య.

  • సీఎం, హైడ్రాపై కేసు పెట్టాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌/హైదర్‌నగర్‌/మాదాపూర్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘హైడ్రా ఎక్కడ తన ఇల్లు కూల్చివేస్తుందో అని మూడు రోజులపాటు ఆందోళన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికీ హైడ్రా అనే అరాచక సంస్థ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన హత్య. రేవంత్‌, హైడ్రాపై హత్య కేసు నమోదు చేయాలి’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హైడ్రాను బ్లాక్‌ మెయిల్‌ సంస్థగా మార్చి, పేదల ఇళ్లను కూల్చుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. కూకట్‌పల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ కుటుంబాన్ని సోమవారం కేటీఆర్‌ పరామర్శించారు. బుచ్చమ్మ కుటుంబ సభ్యులకు వైద్య సాయం అందించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బుచ్చమ్మ భర్తకు రూ.50 వేలు అందించారు.


అదేవిధంగా మాదాపూర్‌లోని సున్నం చెరువులో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఇళ్ల బాధితులను కేటీఆర్‌ పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీతో మాట్లాడారు. చిన్నారికి స్కూల్‌ బ్యాగ్‌, పుస్తకాలు, ఆర్థికసాయం అందజేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చిన అధికారులు.. పేదల ఇళ్లను నేరుగా ఎలా కూలుస్తారని నిలదీశారు. ఆర్థిక మంత్రికి.. హైడ్రాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఐదుగురు బిల్డర్ల పేర్లు ఎలా చెబుతారని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాగా, ‘‘కాంగ్రెస్‌ పాలనలో బంగారు తెలంగాణ బక్కచిక్కిన రాష్ట్రమైంది. నీ కాసుల కక్కుర్తి నిర్ణయాలతో రాష్ట్రం అధోగతిపాలైంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ మండిపడ్డారు. ‘‘దసరాకే కాకుండా.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మూలుగుతున్నా.. వడ్లు కొనాలని అధికారులను ఆదేశించడం లేదు. ఇకనైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి’’ అని అన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 04:40 AM