TS Politics: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్
ABN, Publish Date - Feb 29 , 2024 | 05:28 PM
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు (Loksabha Election) సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ పార్టీల (BRS Party) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపార్టీల నేతలు పరస్పర విమర్శల దాడులకు దిగుతున్నారు. తాజా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. ‘‘నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం’’ అన్నారు.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు (Loksabha Election) సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ పార్టీల (BRS Party) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపార్టీల నేతలు పరస్పర విమర్శల దాడులకు దిగుతున్నారు. తాజా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. ‘‘నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం. సేఫ్ గేమ్ వద్దు.. స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. మీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం’’ అని కేటీఆర్ అన్నారు. ‘‘ఒక్కసీటు మీదే కొట్లాడుదాం.. దమ్ముండే రండి. ఒక్క సీటు గెలిచే దమ్ము ఎవరికి ఉందో తేల్చుకుందాం రా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూాాడా చదవండి
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా.. ఆ పార్టీలో చేరిక
Telangana: ధరణి మార్గదర్శకాలు విడుదల.. కీలక బాధ్యతలన్నీ కలెక్టర్లకే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 29 , 2024 | 05:41 PM