ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: చారాణ కోడికి..! బారాణ మసాలా అంటూ రేవంత్‌కి కౌంటర్

ABN, Publish Date - Jul 19 , 2024 | 12:31 PM

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ రెడ్డి గారు... ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!’ అంటూ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ రెడ్డి గారు... ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!’ అంటూ ఎద్దేవా చేశారు. ఊరించి.. ఊరించి.. ఏడునెలలు ఏమార్చారని విమర్శించారు. మీ రుణమాఫీ తీరు చూస్తే.. తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటేనని.. “చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ” అంటూ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువన్నారు.


ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడన్నారు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడని కేటీఆర్ అన్నారు. అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక.. అంతులేని ఆందోళనలో ఉంటే మీరు మాత్రం సంబరాలు చేసుకుంటారా? ఎందుకీ సంబరాలు? అని నిలదీశారు.


‘నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా?’ ఎందుకీ సంబరాలని కేటీఆర్ నిలదీశారు. రెండు సీజన్లు అయినా.. రైతు భరోసా ఇంకా షురూ చెయ్యలేదని అన్నారు. జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదన్నారు. కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలేదన్నారు. రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

Read More Telangana News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 01:02 PM

Advertising
Advertising
<