ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రేవంత్‌ తుగ్లక్‌ నిర్ణయాలతో ఇబ్బందులు

ABN, Publish Date - Nov 03 , 2024 | 03:35 AM

హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖపు చర్య అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

  • ‘హెచ్‌ఎండీఏ’ పంచాయతీల్లో లే అవుట్ల రిజిస్ట్రేషన్ల బంద్‌ మూర్ఖత్వం

  • పేదలు, మధ్య తరగతి గురించి ఆలోచించడం లేదు: కేటీఆర్‌

  • హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలదా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి):హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖపు చర్య అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పరిపాలనా అనుభవం లేకుండా తుగ్లక్‌ను తలపించేలా సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్‌ శనివారం ప్రకటన విడుదల చేశారు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చేసిన రేవంత్‌ రెడ్డి... తాజాగా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న పేదలు, మధ్య తరగతిని టార్గెట్‌ చేశారన్నారు. వారి ప్లాట్లపై కూడా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.లు మారాయన్నారు. ఇప్పుడు వాటికి ఎవర్ని బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు.


ఇప్పటికే బిల్డర్లను బెదిరిస్తూ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారన్నారు. హెచ్‌ఏండీఏ పరిధిలోని పంచాయతీ లేఅవుట్లలో వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుక్కోవటం ప్రజల తప్పా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్లాట్లు ఎంతోమంది చేతులు మారాయన్నారు. భవిష్యత్తు కోసం పైసా పైసా కూడబెట్టుకొని పేదలు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చెల్లవని ప్రభుత్వం అంటే వారి పరిస్థితి ఏం కావాలో చెప్పాలన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. కొత్త సమస్యలను సృష్టిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రామ పంచాయతీల్లో వేలాదిగా లే అవుట్లు వెలిశాయని, వాటి క్రయ విక్రయాలు జరిగి ఎంతోమంది చేతు

Updated Date - Nov 03 , 2024 | 03:35 AM