ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు: కేటీఆర్.. విషయం ఏంటంటే?

ABN, Publish Date - Sep 02 , 2024 | 08:01 PM

భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరదల సమయంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ఉదయం నుంచి సాయంత్రం దాకా వరదలో రాణి గారు, వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించదు.

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదల సమయంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ఉదయం నుంచి సాయంత్రం దాకా వరదలో రాణి గారు (ఖమ్మం), వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించదు. మధిర నుంచి వారి బంధువులు గజ ఈతగాళ్లని రప్పించి వారే ప్రాణాలు కాపాడుకోవాలి. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే.. ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణాలను కాపాడాలి. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులు, చివరికి దేవుడే దిక్కు అని చేతులెత్తేశారు’’.


‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేస్తారు. ఇప్పుడు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?. ప్రతిపక్షాలు ఎన్ని ప్రజాసమస్యలు ఎత్తిచూపినా స్పందించరు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీచార్జీలతో వారిని హింసిస్తారా?. సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.


ఫిర్యాదుల వెల్లువ..

సెక్రటేరియట్‌లోని వరద సహాయ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. నిన్నటి (ఆదివారం) నుంచి ఇప్పటి వరకు 120 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా నుంచే వచ్చాయి. ఆయా జిల్లాల్లో పరిస్థితుల మేరకు ఇప్పటి వరకు 69 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 2,761 మందికి పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.


కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు, ఎంఎల్ఏ బొజ్జు పటేల్ పరిశీలించారు. కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద పరిస్థితి, వరద గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి వివరాలు, ప్రాజెక్టు వద్ద చేపట్టిన అప్రమత్త చర్యలు వంటి పూర్తి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉన్నందున ఎవరూ గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని మంత్రి సూచించారు.

Updated Date - Sep 02 , 2024 | 08:31 PM

Advertising
Advertising