ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KVP Ramachandra Rao: మా ఫామ్‌హౌస్‌కు అధికారుల్ని పంపండి

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:15 AM

‘‘నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కేవీపీ రామచంద్రరావు ఫామ్‌హౌ్‌సను ఎందుకు కూల్చొద్దు’’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ స్పందించారు.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో కట్టడాలుంటే మార్కింగ్‌ చేయించండి.. నా సొంత ఖర్చులతో కూల్చేయిస్తాను

  • నాకు ఏ మినహాయింపులూ వద్దు

  • నిబద్ధతగల కాంగ్రెస్‌ కార్యకర్తను

  • కాంగ్రెస్‌ సీఎంకు ఇలా చెప్పాల్సి రావడం బాధాకరం

  • మూసీ ప్రక్షాళనకు పూర్తి మద్దతిస్తున్నా

  • రేవంత్‌రెడ్డికి కేవీపీ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కేవీపీ రామచంద్రరావు ఫామ్‌హౌ్‌సను ఎందుకు కూల్చొద్దు’’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ స్పందించారు. అజీజ్‌నగర్‌లో ఉన్న తమ ఫామ్‌హౌ్‌సకు సంబంధిత అధికారులను పంపి, చట్ట ప్రకారం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిని మార్క్‌ చేయించాలని.. ఆ పరిధిలో ఏదైనా కట్టడం ఉంటే తన సొంత ఖర్చులతో 48 గంటల్లో కూల్చేస్తానని శుక్రవారం ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. కూల్చివేత తర్వాత శిథిలాలను తొలగించి శుభ్రం కూడా చేయిస్తానని అందులో పేర్కొన్నారు. ‘‘గడిచిన ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో నిబద్ధత గలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నాను. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని త్రికరణశుద్ధిగా సమర్థిసాను.


చిత్తశుద్థితో అమలు చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. అయితే ఈ రోజున ఒక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రికి ఇలా చెప్పాల్సి రావడం బాధాకరం. అయినా తప్పట్లేదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ‘‘పేదలకు నష్టం కలుగకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్థి పనులనూ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా స్వాగతిస్తాను. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాన్ని దెబ్బతీయడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల ప్రయత్నాలను ఖండిస్తున్నాను’’ అని కేవీపీ స్పష్టం చేశారు. తమ ఫామ్‌హౌ్‌సలో మార్కింగ్‌ ప్రక్రియను పారద్శకంగా నిర్వహించాలని.. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌రెడ్డిని కోరారు.


మార్కింగ్‌ చేసే సమయం, తేదీని ముందే ప్రకటిస్తే తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతలు, వారి అనుకూల మీడియా వీక్షించే అవకాశం కలుగుతుందన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ నాయకునిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులూ వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే విధంగా వ్యవహరిస్తే చాలు. మీ నాయకత్వంలో ఉన్న మన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి నాలో నరనరానా ఉన్న కాంగ్రెస్‌ రక్తం అంగీకరించనందునే మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను’’ అని కేవీపీ పేర్కొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 03:15 AM