ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lasya Nanditha: కారు ప్రమాదంపై స్పందించిన లాస్య నందిత సోదరి నివేదిత

ABN, Publish Date - Feb 23 , 2024 | 07:25 PM

లాస్య నందిత కారు ప్రమాదం ఘటనపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 304(ఏ) ఐపీసీ సెక్షన్ కింద ఆకాశ్‌పై కేసు పెట్టామని వెల్లడించారు. కారు ప్రమాద ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిక స్పందించారు. సదాశివపేటలో పూజలు ముగించుకొని తిరిగి బోయిన్‌పల్లికి వచ్చామని, ఆకలి అవుతుండడంతో ఏమైనా తీసుకొస్తానని చెప్పి లాస్య అక్క వెళ్లిందని తెలిపారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం ఆమె కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. కారు ప్రమాద ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిక స్పందించారు. సదాశివపేటలో పూజలు ముగించుకొని తిరిగి బోయిన్‌పల్లికి వచ్చామని, ఆకలి అవుతుండడంతో ఏమైనా తీసుకొస్తానని చెప్పి లాస్య అక్క వెళ్లిందని తెలిపారు. ఉదయం 4:30 గంటలకు బోయిన్‌పల్లి నుంచి మళ్లీ సదాశివపేట్ వైపు లాస్య కారు వెళ్లిందని, దాదాపు 45 నిమిషాల తర్వాత 5: 15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందంటూ ఆకాశ్ ఫోన్ చేసి చెప్పాడని వివరించారు. ఇద్దరికీ దెబ్బలు తగిలాయంటూ లొకేషన్ షేర్ చేశాడని నివేదిత వివరించారు. తాము వెళ్లి చూసే సరికి అక్కడ నుజ్జు నుజ్జు అయిన కారు మాత్రమే ఉందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

కాగా లాస్య నందిత కారు ప్రమాదం ఘటనపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కారుని నడిపిన ఆకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 304(ఏ) ఐపీసీ సెక్షన్ కింద ఆకాశ్‌పై కేసు పెట్టామని వెల్లడించారు.

కాగా.. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎమ్మెల్యే కారు డ్రైవర్‌‌ను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు సంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అయితే.. ‘ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు.. నాకు అసలు గుర్తే లేదు’ అని డ్రైవర్ చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇవే కాదు ఎన్ని సార్లు అడిగినా.. ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదనే విషయాన్నే చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం డ్రైవర్‌కు ట్రీట్మెంట్ జరుగుతుండగా.. సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే.. డ్రైవర్ నిద్రమత్తే అతివేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చినట్లు తెలియవచ్చింది.


Updated Date - Feb 23 , 2024 | 07:30 PM

Advertising
Advertising