Legal Notice: కేటీఆర్‌కు నోటీసులు.. ఎందుకంటే
ABN, Publish Date - Sep 26 , 2024 | 07:50 PM
అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై ఆయనకు లీగల్ నోటీసులు అందాయి.
హైదరాబాద్: అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై ఆయనకు లీగల్ నోటీసులు అందాయి. తెలంగాణ ప్రభుత్వం శోధ కంపెనీకి ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సుజన్ రెడ్డి ఈ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీకి నోటీసులు అందించారు.
తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా గత కొంత కాలంగా.. తెలంగాణ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ వెంటనే విచారణ చేపట్టి.. నిజాలను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి అధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న అమృత్ టెండర్ల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని బంధువులకు మోసపూరితంగా వందల కోట్ల కాంట్రాక్టులు దక్కేలా చేశారనేది ఆయన ప్రధాన ఆరోపణ. రేవంత్ కుటుంబానికి సంబంధించి అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు కేటాయించారని కేటీఆర్ అన్నారు.
సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా రూ.8 వేల 888 కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలతో పాటు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు. ఈ అంశంపై కేటీఆర్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, సృజన్... రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, తనకు అల్లుడని చెప్పారు. సృజన్‌కు రాజకీయాలతో సంబంధం లేదని వివరించారు.
CM Revanth Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. కాళేశ్వరం కూలిపోయింది: సీఎం రేవంత్
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల
Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Sep 26 , 2024 | 07:51 PM