అమిత్‌షా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:32 PM
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కుమారస్వామి కోరారు.
పాలమూరు యూనివర్సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కుమారస్వామి కోరారు. సోమవారం పీయూలోని అకాడమిక్ భవనం సెమినార్ హాల్‌లో పీయూ ఫ్రొఫెసర్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను విమర్శిస్తే ఆయన కృషిని విమర్శించినట్లే అన్నారు. ప్రపంచ స్థాయిలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నా పార్లమెంటులో రాజ్యంగ నిర్మాతను అవమానపరిచే విధంగా అవహేళన చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. సంఖ్యా బలం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తు ఊరుకోమన్నారు. వ్యాఖ్యలను విరమించుకోకపోతే గాంధీ శాంతిమార్గంలో నిరసనలు చేస్తామని తెలిపారు. పీయూ ప్రొఫెసర్లు డాక్టర్ ఎన్ కిశోర్, డాక్టర్ శేకుంటి రవికుమార్, డాక్టర్ అర్జున్‌కుమార్, డాక్టర్ జిమ్మికాటన్, డాక్టర్ బండి పర్వతాలు, డాక్టర్ మధు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 11:32 PM