ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాస్కెట్‌బాల్‌ సిస్టర్స్‌

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:55 PM

పేద కుటుంబం.. తప్పని ఆర్థిక ఇబ్బందులు.. ఆయినా వారు వెనుకడుగు వేయలేదు. అన్ని సమస్యలను అధిగమించి క్రీడారంగంలో రాణిస్తు న్నారు.

అక్కా చెల్లెళ్లు జ్యోతి, ప్రియాంక - సాయినిఖిత, హరిణి,

- రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణిస్తున్న అక్కా చెల్లెళ్లు జ్యోతి, ప్రియాంక - సాయినిఖిత, హరిణి

- కోచ్‌ మహ్మద్‌ ఖలీల్‌ వద్ద శిక్షణ - క్రీడా కోటాలో ఉన్నత విద్యాసంస్థల్లో సీటు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పేద కుటుంబం.. తప్పని ఆర్థిక ఇబ్బందులు.. ఆయినా వారు వెనుకడుగు వేయలేదు. అన్ని సమస్యలను అధిగమించి క్రీడారంగంలో రాణిస్తు న్నారు. వారే మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన అక్కా చెల్లెళ్లు జ్యోతి, ప్రియాంక - సాయి నిఖిత, హరిణి. వ్యాయామ ఉపాధ్యాయుడు విలియం, కోచ్‌ ఖలీల్‌ ఆధ్వర్యంలో బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ పొందిన వీరు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చా టుతూ బాస్కెట్‌బాల్‌ సిస్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.

నిరుపేద కుటుంబం నుంచి..

మహబూబ్‌నగర్‌ జిల్లా, కోయిలకొండ మండలం, కేశ్వాపూర్‌ పెద్దతండాకు చెందిన రమేశ్‌, హేమ దంపతులు 20 ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. జామపండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. అలా వచ్చిన డబ్బుతోనే పిల్లలను చదివించు కుం టున్నారు. ముగ్గురు కుమార్తెలు కె.జ్యోతి, కె.ప్రియాంక, సుప్రియ పట్టణంలోని మోడ్రన్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. అప్పుడే జ్యోతి, ప్రియాంక వ్యాయామ ఉపాధ్యాయుడు విలియం ప్రోత్సాహంతో బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ పొందారు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, క్రీడా కోటాలో ఇంజనీరింగ్‌ సీట్లు సాధించారు. జ్యోతి తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం విలియమ్‌ కళాశాలలో, ప్రియాంక హిందుస్తాన్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కేఎల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మహబూబ్‌ నగర్‌లోనే ఉంటూ స్టేడియం మైదానంలో డీఎస్‌ఏ కోచ్‌ ఖలీల్‌ పర్యవేక్షణలో బాస్కెట్‌బాల్‌ శిక్షణ పొందు తున్నారు. కేరళ కొట్టెం యూనివర్సిటీలో ఈ ఏడాది డిసెంబర్‌ 20న ప్రారంభమైన నేషనల్‌ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొంటున్నారు.

అమ్మ చూపిన బాటలో..

జనగాం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌, ప్రేమలత దంపతులు 16 ఏళ్ల క్రితం ఉపాధి కోసం మహబూబ్‌నగర్‌ పట్టణానికి వచ్చి, హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాయి నిఖిత, హరిణి ఉన్నారు. శ్రీనివాస్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ప్రేమలత పాఠశాల స్థాయిలో కబడ్డీ క్రీడాకారిణి. అప్పట్లో జిల్లా స్థాయి టోర్నమెంట్లలో పాల్గొన్నది. ఆమె స్ఫూర్తితో ఇద్దరు కుమార్తెలూ క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. బాస్కెట్‌ బాల్‌ క్రీడలో రాణిస్తున్నారు. మోడ్రన్‌ స్కూల్‌ లో చదువుకుంటున్న వీరు వ్యాయామ ఉపాధ్యాయుడు విలియం సహకారంతో, డీఎస్‌ఏ కోచ్‌ పర్యవేక్షణలో బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ పొందుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.

అంతర్జాతీయ స్థాయికి చేరాలి : జ్యోతి

అంతర్జాతీయ స్థాయికి చేరడమే లక్ష్యమని, క్రీడా కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సాధించడమే ధ్యేయమని జ్యోతి అంటోంది. ఆమె పంజాబ్‌లో 2015లో నిర్వహించిన నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ జూనియర్స్‌ టోర్నీలో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నది. ఆదే ఏడాది వరంగల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్‌జీకేఏ టోర్నీలోనూ ప్రతిభ కనబరిచింది. 2016లో కర్ణాటక జరిగిన యూత్‌, ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించిన జూనియర్‌ నేషనల్‌ టోర్నీలో పాల్గొని రాణించింది. ఆదే ఏడాది హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2018లో పంజాబ్‌రాష్ట్రంలోని లుథియానా, 2019లో ఢిల్లీలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19, పంజాబ్‌ రాష్ట్రం లుథియానాలో నిర్వహించిన సీనియర్‌ నేషనల్‌ పోటీల్లో పాల్గొన్నది. 2021లో కేరళ అన్నా యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొన్నది. గుజరాత్‌లో 2022లో నిర్వహించిన 36వ నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నది. ఆదే ఏడాది చైన్నెలో జరిగిన 71వ సీనియర్‌ నేషనల్‌ టోర్నీలో రజత పతకం దక్కించుకున్నది. ఇప్పటి వరకు 26 సార్లు రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీలో జిల్లాకు ప్రాతినిథ్యం వహించింది.

రైల్వేలో ఉద్యోగం సాధిస్తా : ప్రియాంక

క్రీడా కోటాలో ఉద్యోగం సాధిస్తానని బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి ప్రియాంక అంటోంది. ఆమె ఇప్పటి వరకు 22 రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాల్గొని సత్తా చాటు కున్నది. అలాగే 2017లో ఢిల్లీలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి టోర్నీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2018లో ఖేలో ఇండియా నేషనల్‌ గేమ్స్‌ అండర్‌ - 17 విభాగానికి ఎంపికయ్యింది. 2019లో ఢిల్లీలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 బాస్కెట్‌బాల్‌ టోర్నీలో అక్క జ్యోతితో కలిసి రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. తమిళనాడు హిందుస్తాన్‌ యూనివర్సిటీలో 2022లో జరిగిన సౌత్‌జోన్‌ నేషనల్‌, 2023లో ఆలిండియా నేషనల్‌ టోర్నీల్లో పాల్గొన్నది.

దేశ సేవ చేయడమే లక్ష్యం : సాయి నిఖిత

బాస్కెట్‌ బాల్‌ క్రీడలో రాణించి, క్రీడా కోటాలో ఆర్మీలో చేరి దేశసేవ చేయడమే తన లక్ష్యమని సాయి నిఖిత తెలిపింది. ప్రస్తుతం మహ బూబ్‌నగర్‌ పట్టణంలోని మాడ్రన్‌ స్కూల్‌లో చదువుతున్న ఆమె ఇప్ప టి వరకు 10 సార్లు రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొని ప్రతిభ చాటుకు న్నది. 2023లో పాండిచ్చేరిలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-17 జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ టో ర్నమెంట్‌లో రాణించి, రాష్ట్ర జట్టు కు ఎంపికయ్యింది. ఇటీవల మహబూబ్‌నగర్‌ పట్టణంలో నిర్వహించిన సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీల్లోనూ పాల్గొని ప్రశంసలు అందుకున్నది.

డాక్టర్‌ కావడమే ధ్యేయం : హరిణి

క్రీడారంగంలో రాణిస్తూనే చక్కగా చదువుకొని డాక్టర్‌ కావడం తన ధ్యేయమని హరిణి తెలిపింది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని మాడ్రన్‌ హై స్కూల్‌లో చెల్లి సాయి నిఖితతో పాటు 10వ తరగతి చదువుకుంటోంది. ఇప్పటివరకు ఏడు సార్లు జిల్లా స్థాయి టోర్నీలో పాల్గొన్నది. మూడు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని క్రీడాభిమానుల ప్రశంసలు అందుకున్నది.

14 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్న..

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని స్టేడి యం మైదానంలో 14 సంవత్సరాలుగా క్రీడాకారులకు బా స్కెట్‌బాల్‌ శిక్షణ ఇస్తున్నాను. ఉద యం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఇస్తున్నాం. మా వద్ద శిక్షణ పొందిన దాదాపు వంద మంది బాల బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలను సొంతం చేసుకున్నారు. జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా, రాష్ట్రం, దేశానికి పేరు తేవాలి.

- మహ్మద్‌ ఖలీల్‌, బాస్కెట్‌బాల్‌ కోచ్‌

Updated Date - Dec 24 , 2024 | 11:55 PM