మరో మూడు రోజులు నీటి సరఫరాకు బ్రేక్
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:22 PM
మండలంలోని సింగారం చౌరస్తా వద్ద నీటి సర ఫరా పైపులైన్ మరమ్మతుల దృష్ట్యా మరో మూడురోజుల పాటు నీటి కొరత ఉంటుందని మునిసిపల్ కమిషనర్ సునిత, ఇంజనీర్ మహేష్‌లు బుధవారం తెలిపారు.
- సింగారం చౌరస్తాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ లీకేజీ పైపులైన్ పనులు
- పేటలో తాగునీటి కోసం తప్పని తంటా
- బోర్ల నీటిపై ఆధారం
నారాయణపేట, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సింగారం చౌరస్తా వద్ద నీటి సర ఫరా పైపులైన్ మరమ్మతుల దృష్ట్యా మరో మూడురోజుల పాటు నీటి కొరత ఉంటుందని మునిసిపల్ కమిషనర్ సునిత, ఇంజనీర్ మహేష్‌లు బుధవారం తెలిపారు. మునిసిపల్ ఇంజనీర్ మహేష్ ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్‌తో సింగారం చౌరస్తాలో తవ్వకాలు జరిపి పైపులైన్ లీకేజీ మరమ్మతులను కొనసాగిస్తున్నారు. ఇదివరకే ఈ నెల 22న సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు మరికల్ నుంచి నారాయణపేట దారిలో కొత్తతండా వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ ఏర్పడగా లీకేజీ పైపులైన్‌ను తొలగించేందుకు నీటి సరఫరాను నిలిపివేశారు. దాంతో అప్పటి నుంచి నాలుగు రోజులుగా నీటి సరఫరాకు బ్రేక్ పడింది. తాజాగా మరో మూడురోజులు నీటి సర ఫరాకు అవరోధం ఏర్పడనుంది. దీంతో తాగునీటి కోసం నారాయణపేట వాసులు తంటాలు పడుతూ బోర్ల నీటిపై ఆధారపడుతున్నారు.
రోజు విడిచి రోజు నీటి సరఫరా.. ఆపై లీకేజీలతో అవాంతరాలు
నారాయణపేట మునిసిపాలిటీలో ప్రజలకు రోజు విడిచి రోజు నీరు అందుతున్నా అప్పుడ ప్పుడు లీకేజీలతో సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పట్టణవాసుల తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతు న్న అమృత్ 2.0 పథకం ద్వారా రూ.27.66 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఇటీవలే ఎంపీ డీకే.అరుణ, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిలు శంకుస్థాపన పనులు ప్రారంభించారు.
అమృత్ 2.0 పథకం కింద మూడు ట్యాంకుల నిర్మాణం
నారాయణపేట మునిసిపాలిటీలో అమృత్ 2.0 పథకం కింద టీవీ టవర్ వద్ద వెయ్యి కిలోలీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మించనున్నారు. ఎర్రగుట్ట వద్ద 500 కిలోలీటర్లు, వాల్మీకి దేవాలయం వద్ద వెయ్యి కిలోలీటర్ల నీటి సామర్థ్యం కల్గిన ట్యాంకులు నిర్మించనున్నారు. ఇక మిషన్ భగీరథ పైపులైన్ వేయని కొత్త కాలనీలతో పాటు పాత వార్డుల్లో కొత్తగా పైపులైన్లు వేసి నీటి సరఫరాను ప్రతీరోజు అందించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం తొమ్మిది ట్యాంకులతో పట్టణంలో నీటి సరఫరా జరుగుతోంది.
Updated Date - Dec 25 , 2024 | 11:22 PM