అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:10 PM
అంబేడ్కర్‌ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ డిమాండ్ చేసింది.
మహబూబ్‌నగర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : అంబేడ్కర్‌ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ డిమాండ్ చేసింది. అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అమిత్‌షా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానిస్తే ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పోస్ట్‌లు పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే కేంద్రమంత్రులు పార్లమెంట్ ఎదురుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ హఠావో దేశ్‌కు బచావో అన్న నినాదాన్ని గ్రామగ్రామాన తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. నాయకులు ఫహీం, లక్ష్మణ్, ఫక్రు, నాగయ్య, రాజునాయక్, అజ్మత్, తాహెర్, రహీం, ఇమ్రాన్ పాల్గొన్నారు.
అమిత్‌షా సభ్యత్వం రద్దు చేయాలి
పాలమూరు : రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అవమానకరమైన విధంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్ సభ్యత్వం తక్షణమే రద్దు చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.మాణిక్యంరాజు, యం.కుర్మయ్య డిమాండ్ చేశారు. అమిత్‌షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అహంకారం, తిరస్కారపూరితమైన విధంగా చేసిన వ్యాఖ్యలు అమానుషమన్నారు. అదే విధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసన, ధర్నా చేపట్టారు. అరుంధతి, బుద్ధిస్టు సొసైటీ, పాంథర్స్, బహుజన మహానీయుల శోభాయాత్ర నాయకులు జట్లు హనుమంతు, ఆది లక్ష్మయ్య, సింగిరెడ్డి పరమేశ్వర్, కుర్మయ్య, నాగయ్య, ప్రవీణ్‌కుమార్, రమేష్, బాల కృష్ణయ్య, టంకర రాములు పాల్గొన్నారు.
కోయిలకొండ : అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లో అవమాన పరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండి నాగరాజు డిమాండ్ చేవారు. దళిత బహుజనులను అవమానించే విధంగా అమిత్ షా పలుమార్లు మాట్లాడుతున్నా మోదీ పట్టించుకోవడం లేదన్నారు.
Updated Date - Dec 19 , 2024 | 11:10 PM