మనుస్మృతి గ్రంథప్రతుల దహనం
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:23 PM
నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, అంట రానితనానికి కారణమైన మనుస్మృతి గ్రంథాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దహనం చేసిన దినో త్సవం సందర్భంగా బుధవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల నాయకులు మనుస్మృతి ప్రతులను దహనం చేసి తమ నిరసన తెలిపారు.
ఊట్కూర్/మాగనూరు/మక్తల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, అంట రానితనానికి కారణమైన మనుస్మృతి గ్రంథాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దహనం చేసిన దినో త్సవం సందర్భంగా బుధవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల నాయకులు మనుస్మృతి ప్రతులను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు దుర్గం శ్రీనివాస్, ఆర్.దశరథ్‌లు మాట్లాడుతూ మానవ మనుగడకు మనుస్మృతి ప్రమాదం సృష్టించిందన్నారు. మనువు ఆనాటి కాలంలో ఏర్పాటు చేసిన నిచ్చె నమెట్ల కుల వ్యవస్థ సమాజాన్ని వివిధ వర్గాలకు విభజించిందని అన్నారు. అంటరానితనానికి పుట్టుక అయిన మనుస్మృతి వల్లనే నేటికీ దళితులకు ఆలయాల ప్రవేశం లేదని అన్నారు. ఈ గ్రంథం ఉన్నన్ని రోజులు ఇది మానవ మనుగడకు ప్రమాదంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, భరత్, బలరాం, పరశురాం, రాజు, శివలింగప్ప తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, మాగనూరులో అంబేడ్కర్ విగ్రహానికి అంబేడ్కర్ సంఘం నాయకులు పూల మాలలు వేసి మనుధర్మశాస్త్ర పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రాఘవేంద్ర, శ్రీనివాసులు, అనిల్, శంకర్, వసంత్‌కుమార్, నరేష్, తరుణ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్‌లో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మనుశాస్త్ర ప్రతులు దహనం చేశారు. సంఘం నాయకులు పృథ్వీరాజ్, బండారి వెంకటేష్, జి.నగేష్, మద్దిలేటి, నిరంజన్ తదితరులున్నారు.
Updated Date - Dec 25 , 2024 | 11:23 PM