ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

ABN, Publish Date - Apr 18 , 2024 | 01:14 PM

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన (Election notification released) నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్‌ (Mahabubnagar)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎంపీ అభ్యర్థి (MP Candidate) వంశీచంద్ రెడ్డి (Vamsichand Reddy) నామినేషన్ (Namination) కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శనివారం మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.


శనివారం (20వ తేదీ) సాయంత్రం కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22వతేదీ ఉదయం ఆదిలాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 24వ తేదీ ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.


కాగా లోక్‌సభ ఎన్నికలకు అసలైన ఘట్టం మొదలైంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఇప్పటికే ప్రచారంలో ముందున్న పార్టీలు, అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఇందుకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆర్వో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్లు తీసుకోరు. అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయంలో ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. అభ్యర్థులు 25ఏళ్లు నిండిన వారై, ఓటు హక్కు కలిగి ఉండాలి. అయితే అతడు/ఆమె పోటీచేసే నియోజకవర్గంలోని ఐదుగురు ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. అభ్యర్థులు గానీ, వారి ప్రతిపాదకులు గానీ నామినేషన్‌ దాఖలు చేయొచ్చు. నామినేషన్‌తో పాటు అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ కేసులు, విద్యార్హతలకు సంబంధించిన అఫిడవిట్లు సమార్పించాలి. ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేస్తారు. నామినేషన్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే అన్నింటికీ కలిపి డిపాజిట్‌ డబ్బు ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్‌ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో 100 మీటర్ల పరిధిలో మూడు వాహనాలనే అనుమతిస్తారు. నామినేషన్ల దాఖలు నుంచి అభ్యర్థుల ఖర్చు లెక్కించనున్నారు. పత్రికల్లో ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌, ఇతర ఖర్చులు అభ్యర్థి ఖర్చు కింద వేస్తారు. వీడియో సర్వెయలెన్స్‌ టీంలు చిత్రీకరించిన వీడియోలను వీవింగ్‌ టీంలు పరిశీలించి అకౌంటింగ్‌ టీంకు పంపుతారు. ఐటీ, జీఎస్టీ, బ్యాంకింగ్‌, ఎంసీఎంసీ, ఎక్సైజ్‌ తదితర జాబితాలను పరిశీలిస్తారు. వ్యయాలను నమోదు చేసి ఎన్నికల పరిశీలనకు వచ్చే వ్యయ పరిశీలకులకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తారు. ఇప్పటికే ఓటరు జాబితా సవరణ, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్‌ సిబ్బందిని కేటాయించారు. నామినేషన్‌ కేంద్రంలో తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎండలు దంచి కొడుతుండటంతో నామినేషన్‌ కేంద్రం వద్ద ఆచ్చాదనగా ఉండేలా టెంట్లు వేశారు. ప్రతీ లోక్‌సభ అభ్యర్థి గరిష్ఠంగా రూ.95లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ.10వేల వరకు మాత్రమే నగదు రూపంలో ఖర్చు చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడితే చెక్‌రూపంలో లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.


మేడ్చల్‌ కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ కార్యాలయం

మేడ్చల్‌ కలెక్టరేట్‌లో ఈ నెల 18(నేటి) నుంచి 25 వరకు మల్కాజిగిరి స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ద్వారం నుంచే భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి(కలెక్టర్‌) చాంబర్‌ నుంచి 100 నుంచి 300మీటర్ల వరకు పోలీసు బలగాల పహారాతో మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సందర్శకులకు మధ్యాహ్నం 3 తర్వాతే అనుమతి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణలో ఘర్షణలు, అల్లర్లకు తావులేకుండా బందోబస్తు ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ర్యాలీలను రెండు వందల మీటర్ల లోపు నిలిపివేయనున్నారు. మూడు వాహనాలను వంద మీటర్ల వరకు, అక్కడి నుంచి అభ్యర్థితో పాటు మరో నలుగురిని లోనికి అనుమతిస్తారు. ప్రతీ అంశాన్నీ వీడియో చిత్రీకరణ చేస్తారు. కలెక్టరేట్‌ రెండో బ్లాక్‌ న్చుఇ ఉద్యోగులను విధులకు అనుమతిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆ అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది..

గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

Updated Date - Apr 18 , 2024 | 01:17 PM

Advertising
Advertising