ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:33 PM

ప్రజావాణి స్వీకరించిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి స్వీకరించిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, జడ్పీసీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, ఆర్డీవో నవీన్‌ పాల్గొన్నారు.

వృద్ధుడి విన్నపానికి స్పందించిన కలెక్టర్‌

పాలమూరు పట్టణంలో టీడీ గుట్టలో నివాసం ఉంటున్న వయో వృద్ధుడు సాయన్న తన ఇద్దరు కుమారులు శేఖరయ్య, శివరాములు తనతో పాటు భార్య చెన్నమ్మను చూసుకోవడం లేదని 20 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఆర్డీవో నవీన్‌ను ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఇద్దరు కుమారులు శేఖరయ్య, శివరాములుకు వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం కింద ఈనెల 5న నోటీసులు జారీ చేస్తూ ఈనెల 28న ఆర్డీవో ట్రిబ్యునల్‌, ఆర్డీవో కార్యాలయానికి హాజరు కావాలని నోటీస్‌లో పేర్కొన్నారు. స్పందించిన ఆ ఇద్దరు కుమారులు తల్లీదండ్రుల బాగోగులు చూసుకుంటామని సోమవారం ప్రజావాణికి రాగా, వృద్ధుడు సాయన్న కృతజ్ఞతు తెలుపుతూ తాను ఇచ్చిన ఫిర్యాదును వాపస్‌ తీసుకున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:33 PM