కరాటే విద్యార్థులకు అభినందన
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:38 PM
రాష్ట్రస్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు కింగ్‌షోటోకాన్ వి ద్యార్థులు అర్షజమీల్, హుజే ఫ్, మైనద్దీన్, బాలేషరీఫ్ ఎం పికయ్యారు.
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు కింగ్‌షోటోకాన్ వి ద్యార్థులు అర్షజమీల్, హుజే ఫ్, మైనద్దీన్, బాలేషరీఫ్ ఎం పికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అభినం దించారు. ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని, రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలన్నారు. జహంగీ ర్‌పాషఖాద్రీ, ఖలీద్‌నవీద్, ఖాజా కుతుద్దీన్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎదిర విద్యార్థి
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు మునిసి పాలిటీ పరిధిలోని ఎదిర నాల్గవ వార్డులో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని పూజిత ఎంపికైం ది. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం హేమచంద్రుడు అభినందించారు. కార్యక్రమంలో పీడీ పరశురాం, కరాటే మాస్టర్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి ముర్మును కలిసిన ఒబేదుల్లా
మహబూబ్‌నగర్: శీతాకాల విడిదికి హైదరా బాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ముర్మును మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ కలిశారు.శుక్రవారం ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన కొత్వాల్ రాష్ట్రపతికి నమస్కరించి పరిచ యం చేసుకున్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:38 PM