ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనుస్మృతి వల్లే దళితులకు అవమానాలు

ABN, Publish Date - Dec 25 , 2024 | 11:24 PM

భారతదేశంలో మనుస్మృతి వల్లే దళితులు అనేక అవమానాలు, చీత్కరింపులకు గురయ్యారని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌

- సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌

పాలమూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : భారతదేశంలో మనుస్మృతి వల్లే దళితులు అనేక అవమానాలు, చీత్కరింపులకు గురయ్యారని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ‘మనుస్మృతి - రాజ్యాంగం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1927 డిసెంబరు 25న మహదు పట్టణంలో మనుస్మృతి పదాలను డా బీఆర్‌ అంబేడ్కర్‌ దహనం చేశారని గుర్తు చేశారు. నేటికి 97 ఏళ్ల క్రితం అంబేడ్కర్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దళితులు అవమానాలు, అణచివేత, మెజారిటీ ప్రజలు సర్వ హక్కులు కోల్పోయారని తెలిపారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నేటికీ పెంచిపోషిస్తున్నది మనువాదం శాస్త్రం అన్నారు. అందుకే అంబేడ్కర్‌ దహనం చేశారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఒక్కో అంశాలను తొలగిస్తూ ఉందన్నారు. ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. నేడు బీజేపీ నాయకులు దేశ భక్తులుగా చలామణి అవుతూ సమస్యలపై ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ప్రతీ ఒక్కరు కంకణ బద్దులై గ్రామగ్రామాన మనుస్మృతి, రాజ్యాంగానికి ఉన్న తేడాను వివరించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మయ్య, టీపీఎస్‌కే జిల్లా కార్యదర్శి వి.కురుమూర్తి పిలుపునిచ్చారు. ఆదివిష్ణు, వి.పద్మ, శంకర్‌రాములు, ఎ.లక్ష్మయ్య, రాములు, పద్మ, హన్మంతు, నందు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:24 PM