బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతోనే దేవరకద్ర వెనుకబాటు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:36 PM
గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నియో జకవర్గం అభివృద్ధి లో వెనుకబడిందని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవిం ద్‌కుమార్‌రెడ్డి, మండల నాయకులు అన్నారు.
- టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి
దేవరకద్ర, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నియో జకవర్గం అభివృద్ధి లో వెనుకబడిందని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవిం ద్‌కుమార్‌రెడ్డి, మండల నాయకులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఫారుక్‌అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లా డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న ఏడాదిలోపే ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. దేవరకద్ర మండలాన్ని మునిసిపాలిటీ చేసినం దుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభు త్వ హయాంలో అది మంజూరు చేశాం అంటూ ప్రకటనలో పరిమితమయ్యారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అభివృద్ధికి సహక రించాలని కోరారు. అనంతరం మునిసిపాలిటీ ఏర్పాటు అయిన సందర్బంగా పాతబస్టాండ్ వ ద్ద టపాసులు కాల్చి సంబరాలు చేశారు. కార్య క్రమంలో అంజిల్‌రెడ్డి, నరసింహరెడ్డి, గోవర్దన్ రెడ్డి, నర్వశ్రీను, ఆదిహన్మంతురెడ్డి, కొండ అంజన్ కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:36 PM