జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభం
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:23 PM
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా సైక్లింగ్ పోటీలను శుక్రవారం జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేష్, తహసీల్దార్ సతీష్ కుమార్‌లు ప్రారంభించారు.
మక్తల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా సైక్లింగ్ పోటీలను శుక్రవారం జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేష్, తహసీల్దార్ సతీష్ కుమార్‌లు ప్రారంభించారు. కర్ని రోడ్‌లో బాలికలకు ఐదు కిలోమీటర్లు, బాలురకు పది కిలోమీట ర్లు, పురుషులు, మహిళలకు పది కిలోమీటర్ల రోడ్‌స్పీడ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో వెంకటేష్, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం మాట్లాడుతూ విజేతలను ఈనెల 27 నుంచి 29వరకు హైదరాబాద్ మహేశ్వరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 300 మంది బాల బాలికలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు గోపాలం తన సొంత ఖర్చులతో హెల్మెట్స్, టీ షర్టులు అందించారు. కార్యక్రమంలో పీడీలు విష్ణువర్దన్‌రెడ్డి, నరేష్, ఈశ్వర్, రమేష్‌కుమార్, దామోదర్, అంబ్రేష్, రాకేష్, మీనాకుమారి, రాజేశ్వరీ, శ్రీవాణి, రేణుక, దీప, పుష్పలత, స్వరూప, సౌమ్య, లత, విద్యాసాగర్, ఆంజనేయులు, లియాఖత్ అలీ, నవనీత, డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:23 PM