ధార్మిక కార్యక్రమాలకు పూర్తి తోడ్పాటు
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:23 PM
ఆలయాల అభివృద్ధి కోసం తనవంతు పూర్తి తోడ్పాటునందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఆలయాల అభివృద్ధి కోసం తనవంతు పూర్తి తోడ్పాటునందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్ రెడ్డి అన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో పా ల్గొనడం ద్వారా ప్రజల్లో మానసిక మార్పుతో పాటు సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నా రు. గురువారం పట్టణంలోని 24వ వార్డు పరిధి రాఘవేంద్రకాలనీ వద్ద గల హనుమాన్ ఆల య ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యాలను మరింత మెరుగ్గా అందుబాటులోకి తేవాలన్నారు. పట్టణ అభివృద్ధి విషయంలో గడచిన ఆరేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపట్టామని, అదే ఒరవడిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్నారు. 15వ ఆర్థి క సంఘం నిధులు రూ.7లక్షలతో ఆలయ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టినట్లు స్థానిక కౌన్సిలర్ టి.శ్రీనువాస్ ముదిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నరహరిగౌడ్, మురళి, పూడూరు కృష్ణ, నాయ కులు గోవిందు, రిజ్వాన్, ధర్మనాయుడు, నాగేం ద్ర యాదవ్, రామాంజి ఉన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:23 PM