ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:26 PM
క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
మహబూబ్‌నగర్/జడ్చర్ల/మిడ్జిల్/దేవరకద్ర/నవాబ్‌పేట/చిన్నచింతకుంట, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని క్రిష్టియన్ కాలనీలో కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్‌చార్జి సీజే బెనహర్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ కేక్ కట్ చేశారు. నాయకులు వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, సిరాజ్‌ఖాద్రి, అనిత, షబ్బీర్‌అహ్మద్ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలోని ఎంబీ చర్చిలో నిర్వహించిన వేడుకలకు హైదరాబాద్‌లోని ఏసీటీసీ రెవరెండ్ యోనాతాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని, క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. పట్టణంలోని పెంథకోస్ట్ చర్చితో పాటు పలు చర్చీల్లో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముఖ్య వక్తలు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు.
మిడ్జిల్ మండలం రెడ్డిగూడ, వాడియాల, మున్ననూర్, కొత్తూరు, అయ్యవారిపల్లి, వెలుగొమ్ముల, కొత్తపల్లి, మిడ్జిల్ గ్రామాల్లోని చర్చీల్లో క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండల కేంద్రంలోని చర్చిలో మార్కెట్ ఛైర్మన్ జ్యోతి ప్రత్యేక ప్రార్థన అనంతరం కేక్ కట్ చేశారు. చర్చి పాస్టర్ అబిశోలుం, రాజారత్నం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, బరిగెల వెంకటయ్య, సాయులు, మల్లికార్జున్‌రెడ్డి, ఉస్మాన్, వెంకట్‌రెడ్డి, సిరాజ్, వెంకట్‌సాగర్, దేవరాజు పాల్గొన్నారు.
దేవరకద్ర మండల కేంద్రంతో పాటు కౌకుంట్ల, పేరూర్ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రెస్తవ సోదరులు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నవాబ్‌పేట మండలంలోని చౌడూర్, మల్లారెడ్డిపల్లి, కారూర్, తీగలపల్లి, నవాబ్‌పేట, కూచూర్, దయపంతులపల్లి, పోమాల్ గ్రామాల్లోని చర్చీల వద్ద పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
చిన్నచింతకుంట మండల కేంద్రంతో పాటు ఉంద్యాల, నెల్లికొండిలోని ఎంబీ చర్చీలో క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పాల్గొని, కేక్‌ను కట్ చేశారు. అప్పంపల్లి సింగిల్ విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌రెడ్డి, పట్టెం శివకుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గిజ్జన్, యోనా, శేఖర్, ప్రతాప్, సుదర్శన్, విజయ్, యాకోబు, బోజస్ పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 11:26 PM