ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:47 PM

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ 19 వాలీబాల్‌ క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి.

తలపడుతున్న గుజరాత్‌, సీబీఎస్‌ఈ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ జట్లు

- మూడో రోజు కొనసాగిన జాతీయ స్థాయి క్రీడలు

- 21 రాష్ట్రాల నుంచి పాల్గొంటున్న 32 జట్లు

కోస్గి రూరల్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ 19 వాలీబాల్‌ క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం మూడో రోజుకు చేరుకున్న ఈ పోటీల్లో దేశం నలు మూలల నుంచి (21 రాష్ట్రాలు, నాలు గు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏడు కేంద్ర విద్యాసంస్థలకు చెందిన) 32 జట్లు తలపడుతున్నాయి. మూడో రోజు పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, కోస్గి జడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రకా్‌షరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబరిచి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. పోటీలను నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలతో పాటు సమీప కర్ణాటక రాష్ట్రం క్రీడాభిమానులు వచ్చి తిలకిస్తున్నారు. జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి వెంకటేష్‌, కాంగ్రెస్‌ పార్టీ కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:47 PM