ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెరిగిన దిగుబడి.. తగ్గిన ధరలు

ABN, Publish Date - Dec 21 , 2024 | 11:17 PM

దేశ వ్యాప్తంగా కంది ధరలు దగ్గుతున్నాయి. వి విధ రాష్టాలలో దిగుబడి అధికంగా ఉండి విక్ర యాలకు వస్తుండటంతో నాలుగు రోజులుగా కంది ధరలు దిగుతూ వస్తున్నాయి. నారాయణ పేట జిల్లాలో కంది ధరలు తగ్గుతున్నాయి.

పేట మార్కెట్‌ యార్డులో కంది లాట్స్‌ నాణ్యతను పరిశీలిస్తున్న సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌

- కంది ధరలు తగ్గుతున్నాయి....

- వివిధ రాష్ట్రాల్లో దిగుబడి పుంజుకుంటోంది

- మరుసటి రోజు ఈ నామ్‌ టెండర్‌లో విక్రయించుకునే వెసులుబాటు

నారాయణపేట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా కంది ధరలు దగ్గుతున్నాయి. వి విధ రాష్టాలలో దిగుబడి అధికంగా ఉండి విక్ర యాలకు వస్తుండటంతో నాలుగు రోజులుగా కంది ధరలు దిగుతూ వస్తున్నాయి. నారాయణ పేట జిల్లాలో కంది ధరలు తగ్గుతున్నాయి. కంది క్వింటాల్‌ వెంబడి మూడు వేల రూపాయల వర కు తగ్గింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలలో కంది దిగుబడి అధికంగా వస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట్‌ యార్డు ఖరీదు దారు లు పేర్కొంటున్నారు. కంది ధరలు తగ్గడంతో ఇటీవల నారాయణపేటలో రైతులు అంతర్రాష్ట్ర రహదారిపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ మార్కెట్‌ కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యం లో.. అధికారులు అప్రమత్తమై క్షేత్ర స్థాయిలో కం ది లాట్‌లు పరిశీలించి గ్రేడ్‌ల వారిగా గుర్తించేం దుకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ నామ్‌ ద్వారా టెండర్లు అయిన కంది ధర లు రైతులకు నచ్చకపోతే మరుసటి రోజు కందిని టెండర్లలో ఉంచి అమ్ముకునే వెసులుబాటు ఉందని, ఏ రైతు కూడా బలవంతంగా కంది సరకును విక్రయించుకోవద్దని మార్కెట్‌ కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌లు సూచిస్తున్నారు.

పేట యార్డులో 689 కంది లాట్‌లు, 2203.04 క్వింటాళ్లు

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శనివారం విక్రయానికి వచ్చిన కంది లాట్‌లు 689 ఉన్నాయి. అందులో క్వింటాల్‌ ధర రూ. 7550 లోపు 29 లాట్‌లు 120.54 క్వింటాళ్లు నాలుగు శాతం ఉన్నాయి. క్వింటాల్‌ ధర రూ.7551 నుంచి రూ.8000 వరకు 139 లాట్‌లు 686.98 క్వింటాళ్లు 22.82 శాతం, క్వింటాల్‌ ధర రూ 8001 నుంచి రూ. 9000 వరకు 521 లాట్‌లు 2203.04 క్వింటాళ్లు 73.18 శాతం ఉన్నాయి. దాంతో కంది 689 లాట్‌లకు 3010.56 క్వింటాళ్లు విక్రయానికి రాగా అధికంగా 73.18 శాతం 521 లాట్‌లు 2203.04 క్వింటాల్‌ ధర రూ 8001 నుంచి రూ. 9000 వరకు పలికింది.

Updated Date - Dec 21 , 2024 | 11:17 PM