అంబేడ్కర్‌ను అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టే
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:49 PM
అంబేడ్కర్ ను అవమానించడమంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నా రు.
-నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి
అచ్చంపేట, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ను అవమానించడమంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నా రు. కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం పట్టణం లో ర్యాలీ నిర్వహించారు.. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహా నికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమిత్‌షా వ్యాఖ్యలతో అంబేడ్కర్‌పై బీజేపీ వైఖరి ఏమిటో మరో సారి బహిర్గతమైందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత వ్య వస్థ అన్నారు. మనుసు నిండా మనువాదాన్ని నింపుకొని అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించే బీజేపీ నేతలకు రాజ్యాంగబద్ద పదువుల్లో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తక్షణమే దేశ ప్రజలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు రామనాథం, కుంద మల్లికార్జున్, మల్లేష్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 11:49 PM