ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా క్రిస్మస్‌

ABN, Publish Date - Dec 25 , 2024 | 11:20 PM

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

పేట ఎంబీ ఎబినైజర్‌ చర్చిలో కేక్‌ కట్‌ చేస్తున్న పాస్టర్‌ ఆర్‌.జాన్‌, చైర్మన్‌ దేవపుత్ర, వైస్‌ చైర్మన్‌ రత్నయ్య తదితరులు

- చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

- పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నారాయణపేట/నారాయణపేటరూరల్‌/మరికల్‌/ఊట్కూర్‌/కొత్తపల్లి/మద్దూర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా జిల్లాలో ని పలు చర్చీలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చర్చీల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఏసు జీవిత చరిత్రను వివరించగా, మహిళలు గీతాలను ఆలపించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. నారాయణపేట ఎంబీ ఎబినైజర్‌ చర్చీ లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, కేక్‌ ను కట్‌ చేశారు. పాస్టర్‌ ఆర్‌.జాన్‌, చైర్మన్‌ దేవపుత్ర, వైస్‌ చైర్మన్‌ రత్నయ్య, వినోద్‌కుమార్‌, ఆనంద్‌కుమార్‌, దినేష్‌, తిమ్మోతి, మురళీ మనో హర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లో సెబ్‌రోన్‌ చర్చీలో పాస్టర్‌ పరంజ్యోతి యేసు ప్రవచనాలను వివరించారు. పద్మావతి కాలనీలోని బిలివర్‌ చర్చీలో పాస్టర్‌ జాన్‌సన్‌ యేసు పుట్టుక గురించి వివరించారు. కార్యక్రమంలో మహిళలు, చర్చీ కమిటీ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.

అదేవిధంగా, నారాయణపేట మండలంలోని సింగారం ఇమ్మాన్యుయల్‌ చర్చితో పాటు బైరంకొండ, కొల్లంపల్లి చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏసు మహిమలను కొనియాడారు. కార్యక్రమంలో క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరికల్‌ మండల కేంద్రంలో ఉన్న రెండు చర్చిల్లో బుధవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది గంటలకు ఆయా చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో దేవదాస్‌, శ్యామ్‌సుందర్‌, జయపాల్‌ తదితరులున్నారు.

ఊట్కూర్‌ మండల కేంద్రంతో పాటు, కొల్లూర్‌, పెద్దపొర్ల గ్రామాల్లో బుధవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా చర్చీల్లో ప్రత్యేక ప్రా ర్థనల అనంతరం పెద్దల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి పండుగ జరుపుకున్నారు. ఊట్కూర్‌ చర్చీలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యప్రకాష్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసిన అనంతరం పంచిపెట్టి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు దుర్గం శ్రీనివాస్‌, మాజీ ఉప సర్పంచ్‌ కొండన్‌గోపాల్‌, పాస్టర్లు మెజెస్‌పాల్‌, జనార్దన్‌, కొల్లూర్‌ మాజీ సర్పంచ్‌ సంవృద్ది, పాస్టర్‌ డేవిడ్‌, క్రైస్తవ పెద్దలు రాజుప్రకాష్‌, అశోక్‌, దేవానంద్‌, కొల్లూర్‌, పెద్దపొర్లతో పాటు, ఇతర గ్రామాల క్రైస్తవులు పాల్గొన్నారు.

కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని మెథడిస్ట్‌ చర్చీలో పాస్టర్‌ విజయ్‌ క్రీస్తు బో ధించిన శాంతియుత సందేశాన్ని వివరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవదాస్‌, సవారి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

మద్దూర్‌ మండల కేంద్రంతో పాటు, భూనీడ్‌, ఖాజీపూర్‌, నాగిరెడ్డిపల్లి, దోరేపల్లి తదితర గ్రామాల్లోని చర్చీలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించా రు. మద్దూర్‌ చర్చీలో జరిగిన వేడుకలకు మాజీ ఎంపీపీ విజయలక్ష్మి, కోస్గి మార్కెట్‌ చైర్మన్‌ భీములు, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు మల్లి కార్జున్‌, రమేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులను చర్చీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Updated Date - Dec 25 , 2024 | 11:20 PM