పాస్టర్లకు నా వంతు సహకారం
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:50 PM
చర్చీల పాస్టర్లకు క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తనసొంత ఖర్చులతో దుస్తులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో సోమవారం గద్వాల నియోజక వర్గంలోని అన్ని చర్చీల పాస్టర్లకు క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తనసొంత ఖర్చులతో దుస్తులు పంపిణీ చేశారు. కేకు కట్‌చేసి పాస్టర్లకు తినిపించి క్రిస్మ స్ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో క్రైస్తవ సోదరు లు సరైన అవగాహన లేక దేవుని గురించి తెలి యక చాలామంది సరైనవ్యవస్థలో పరిస్థితి చూ డటం జరిగిందన్నారు. పాస్టర్లకు నావంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్వ హనుమంతు, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పాస్టర్లు ఉన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 11:50 PM